అమలా కొత్త ప్రియుడి భాగోతం !

దర్శకుడు విజయ్ తో ప్రేమ, పెళ్లి.. విడాకులు తర్వాత అమలా పాల్ మరింతగా రాటు దేలింది. సినిమాల్లో బోల్డ్ గా కనిపించడమే కాదు. బయట కూడా బోల్డ్ గా మాట్లాడేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ముక్కుసూటిగా వెళ్తోంది.

2014లో విజయ్-అమలాల వివాహం జరిగింది. పట్టుమని మూడేళ్లు తిరిగకముందే విడాకులు తీసుకొన్నారు. పెళ్లి తర్వాత ఇక అమలా పనైపోయిందనే ప్రచారం జరిగింది. కానీ, అమలా అందరికీ షాక్ ఇస్తూ మునుపటికంటే బిజీ అయింది. సూపర్ హిట్స్ అందుకొంది. నటిగా ఓ మెట్టేక్కేసింది. విభిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తోంది.

ఆమె తాజా చిత్రం ‘ఆడై’. తెలుగులో ఆమెగా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అమలా తాను మళ్లీ ప్రేమలో పడ్డానని, అతడు ఇండస్ట్రీకి చెందిన వాడు కాదని తెలిపింది. తాజాగా కొత్త ప్రియుడు గురించి మరిన్ని వివరాలు తెలిపింది అమలా. ఈసారి నిజం చెప్పింది. కొత్త ప్రియుడు కూడా ఇండస్ట్రీకి చెందిన వాడే. ఆడై కథ చెప్పినప్పుడే ప్రేమలో పడిందట. తనంటే ఆయనకి చాలా ఇష్టం. తల్లి ప్రేమకి సమానంగా ఆయన ప్రేమ ఉంది.

తన చిత్రాలను చూసి చాలా భయంకరమైన నటినని అంటుంటాడు. తన కోసం అతని పని కూడా పక్కన పెట్టాడని, సినిమాపై తనకున్న ఆసక్తిని తను బాగా అర్థం చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. మొత్తంగా.. ప్రస్తుతం అమలా కొత్త ప్రియుడు ప్రేమలో మునిగితేలుతోంది. విజయ్ తో ప్రేమలో పడిన సమయంలో అమలా ఇలాంటి ఫీలింగ్స్ నే బయటపెట్టింది. ఇప్పుడు కొత్త ప్రియుడితో మరోసారి. మరీ.. ఈ బంధం అయిన పెళ్లి వరకు వెళ్లి జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షింద్దాం. అన్నట్టు.. కొత్త ప్రియుడు ఎవరన్నది అమలా ఇంకా బయటపెట్టలే.. !