స్టార్ కమెడియన్’కు మాతృవియోగం


కోలీవుడ్ స్టార్ కమెడియన్ వివేక్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఎక్కువగా అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. స్టార్ హీరోల సినిమాల్లో మెరిశాడు. వివేక్ ఇంట్లో విషాదం నెలకొంది. వివేక్ తల్లి మ‌నియ‌మ్మ‌ల్(86) అనారోగ్యంతో క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మునియమల్ బుధవారం చెన్నైలో క‌న్నుమూశారు. కోలీవుడ్ సినీ ప్రముఖులు మునియమల్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. వివేక్ స్వస్థలం శంక‌ర‌న్ కోవిల్‌లోని పెరుంగుట్టూర్‌లో ఈరోజు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.