‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ సాంగ్ అప్ డేట్ వచ్చేసింది


నేచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’గా మారిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ అవకాశం నానికి మాత్రమే దక్కింది. ‘గ్యాంగ్ లీడర్’గా మారాలని మెగా హీరోలు ఎంత ప్రయత్నించినా.. ఫలించలేదు. ఇక నాని ‘గ్యాగ్ లీడర్’కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఆగస్టు 30న గ్యాంగ్ లీడర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది చిత్రబృందం.

ఇప్పటికే గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో నాని గ్యాంగ్ గా “బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను”లని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ చేసే హడావుడి మాములుగా ఉండదని నాని హింట్ ఇచ్చాడు. ఇప్పుడీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్ డేట్ వచ్చేసింది. ఇవాళ సాయంత్రం 7గంటలకి ‘రా.. రా.. ‘ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబ్రందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది.