‘ఇస్మార్ట్ శంకర్’ ట్విట్టర్ రివ్యూ


డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్ కొడితే.. ప్రేక్షకుల దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. గతంలో ఇలాంటి సినిమాలు పూరి నుంచి వచ్చాయ్. దేశముదురు, ఇడియట్, పోకిరి.. సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయ్. ఐతే, పూరి ప్రస్తుతం ఫామ్ లో లేడు. తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈసారి ఎనర్జిట్ హీరో రామ్ ని ‘ఇస్మార్ట్ శంకర్’గా రెడీ చేశాడు. నిధి అగర్వాల్, నభా నటాషా హీరోయిన్లు. ఛార్మితో కలిసి పూరి నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయి. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా టాక్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. దానిపై ఓ లుక్కేద్దాం పదండీ !

ముందుగా పూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఈసారి పూరి మార్క్ కనబడింది. పూరి ఈజ్ బ్యాక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ ఫస్టాఫ్ ని సాదాసీదా అనిపించినా.. సెకంఢాఫ్ దిమ్మతిరిగేలా ఉందని చెబుతున్నారు. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇందులో పోకిరి రేంజ్ ట్విస్ట్ ఉండనుందని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే సినిమాని నిలబెట్టిందని చెబుతున్నారు.

ఇక, రామ్ అదరగొట్టేశాడు. రామ్ నటన, డ్యాన్స్, ఎనర్జి సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లిందని చెబుతున్నారు. మణిశర్మ మేజిక్ చేశాడు. సెకాంఢాఫ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూనకం వచ్చేలా ఉంది. హీరోయిన్స్ నిధి, నభా ముద్దొస్తున్నారు. మొత్తంగా ఫస్టాఫ్ యావరేజ్, సెకాంఢాఫ్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. పాజిటివ్ టాక్ తో ఇస్మార్ట్ శంకర్ థియేటర్స్ లో రచ్చ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.