ఇక్కడ పులివెందుల పంచాయితీలు కుదరవ్.. !
అసెంబ్లీలోనూ సీఎం జగన్ పులివెందుల పంచాయితీల తరహాలోనే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. గురువారం అసెంబ్లీ వద్ద చంద్రబాబు మీడియాతో పిచ్చాపాటిగా మట్లాడారు. బెదిరింపులకు దిగడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పంచాయితీలు పులివెందులలో కుదురుతాయేమోగానీ అమరావతిలో కుదరవన్నారు.
ఉండవల్లిలోని తన ఇంటి గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. అది నదీ పరీవాహకం కిందికి రాదు. గూగుల్లో చూసినా కృష్ణా నది భవాని ఐల్యాండ్ నుంచి చూపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఉండటం వల్ల పాయ చీలి నీరు ఇటువైపునకు వస్తోందని చెప్పారు. ఇక, రాజధాని అమరాతిలో రియల్ రంగం కుదేలైంది. షేర్ మార్కెట్ మాదిరిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక గన్నవరంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయని ఆయన ఆరోపించారు.