దేవ్ పటేల్’తో శృంగారం లీకుపై రాధికా రియాక్షన్
నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి ? నగ్నంగా నటించడానికి తనకి ఎలాంటి అభ్యంతారాలు లేవని ధైర్యంగా చెప్పగలిగిన నటి రాధిక ఆప్టే. కథ డిమాండ్ చేస్తే ఆమె ఏం చేయడానికైనా రెడీ. హాలీవుడ్ చిత్రం ‘ద వెడ్డింగ్ గెస్ట్’ కోసం నటుడు దేవ్ పటేల్-రాధికలపై చిత్రీకరించిన శృంగార సన్నివేశం ఒకటి లీకైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధికపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్. వాటిని రాధిక అంతే గట్టిగా తిప్పుకొడుతున్నారు. మన సమాజంలో సైకో మెంటాలిటీకి ఈ సీన్ లీకే నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక దేవ్ పటేల్’తో శృంగార సన్నివేశం లీకుపై స్పందించారు. ‘ఈ సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ, శృంగారానికి సంబంధించిన సీన్‌ను మాత్రమే లీక్ చేశారు. దీనికి కారణం మన సమాజం సైకోటిక్ మెంటాలిటీనే’ అన్నారు. లీకైన సీన్ లో దేవ్ పటేల్ కూడా ఉన్నాడు. ఆయనపై ఎందుకు ప్రచారం చేయడం లేదు. తననే ఎందుకు తగులుకొన్నారని ప్రశ్నించింది. భారత్‌లో, విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం నేను చూశాను. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి? ఒక నటిగా నా శరీరం కూడా ఒక సాధనమే. బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవని రాధిక గతంలోనే తెలిపింది.