ముదురు హీరోల ప్రేమలో రకుల్ !
స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ ముదురు హీరోలని ఇష్టపడుతోంది. వారితో రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. వారికి పెళ్లైన పర్లేదు అంటోంది. ‘దే దే ప్యార్ దే’లో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో రొమాన్స్ చేసింది. ఆయనకి అప్పటికే పెళైనా.. తన వైపుకు తిప్పుకొంది. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ రకుల్ సీనియర్ హీరోలని టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ‘మన్మథుడు2’లో నాగ్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ కథ కూడా దే దే ప్యార్ దే టైపే.
లేటు వయసులో అవంతిక అనే అందాల భామతో ప్రేమలో పడిన ఓ మన్మథుడి కథ ఇది. వారి ప్రేమప్రయాణానికి అందమైన దృశ్యరూపం గా ఈ సినిమా ఉంటుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ్-రకుల్ రొమాన్స్ హైలైట్ గా ఉండనుందని చిత్రబృందం చెబుతోంది. కాకపోతే.. ఇందులో నాగ్ కు పెళ్లికాదు. కానీ, ఆయనకి బోలేడు ఎఫైర్లు ఉంటాయి. అవి ఎవరికీ తెలియవు. ఇంకా ఫ్రెష్ లా కటింగ్ ఇచ్చేసి.. రకుల్ ని ముద్దులోకి దింపుతాడట నాగ్. అన్నట్టు ఇది మన్మథుడు చిత్రానికి కంప్లీట్ రివర్స్ లా ఉండనుందని టాక్.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు2 తెరకెక్కుతోంది. సమంత, కీర్తి సురేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 9న రెండో మన్మథుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.