ప్రాణం కన్నా.. ఎక్కువ ప్రేమించినా.. !

‘ఇస్మార్ట్ శంకర్’ కటౌట్ చూస్తే రామ్ కష్టం కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ చేశాడు. పూరి అనే పాత్రలో ఒదిరిపోయాడు. తన ఎనర్జి, నటనతో ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేసేలా కనిపించాడు. ఇక, ఈ కష్టానంతా కలగలిపి సినిమా రిలీజ్ ముందు ఓ ట్విట్ చేశాడు రామ్. అది రామ్ కు సినిమా ఉన్న కసిని తెలియజేస్తోంది. ‘ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినా.. ప్రాణం పెట్టి జేసినా.. ఇగ వీన్ని మీకే వదిలేషినా.. ‘అంటూ ట్విట్ చేశాడు రామ్. ఇప్పుడీ ట్విట్ వైరల్ అవుతోంది.

ఇక, ఇస్మార్ట్ శంకర్ కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. దిమ్మ తిరిగే క్లైమాక్స్ చూపించాడు. నేపథ్య సంగీతంతో మణిశర్మ మేజిక్ చేశాడు. థియేటర్స్ లో ప్రేక్షకులని పూనకం తెప్పించాడు. సెకాంఢాఫ్ లో వచ్చే ట్విస్ట్.. అదిరిపోయింది. పోకిరి ట్విస్ట్ ని మైమరిపించిందనే టాక్ వినిపిస్తోంది. పాజిటివ్ టాక్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం దావత్ చేసుకొనేందుకు రెడీ అవుతుంది.