ధోనిపై సీనియర్లు ఎటాక్ !


వెస్టిండీస్‌ పర్యటన కోసం శుక్రవారం బీసీసీఐ సెలక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ రిటైర్డ్మెంట్ పై సీరియస్ చర్చ జరుగుతోంది. ధోని రిటైర్‌ అవుతాడా? ఇంకా ఆటలో కొనసాగుతాడా? ఐతే ఎంతకాలం?జట్టులో ఇప్పుడతని పాత్ర ఏంటీ ? అన్నదానిపై సీనియర్లు సీరియస్ గా చర్చిస్తున్నారు.

ధోని కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో డేరింగ్ స్టెప్ తీసుకొన్నాడు. సెహ్వాగ్ లాంటి సీనియర్లని కాదని యువ క్రికెటర్లు కావాలని పట్టుబట్టాడు. సాధించుకొన్నాడు. వారితో టీ20 వరల్డ్ కప్ తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత కూడా ధోని యువకులకే పెద్ద పీఠ వేశాడు. బ్యాట్స్ మెన్ ప్రతిసారి పరుగులు చేయొచ్చు. చేయకపోవచ్చు. కానీ, ఓ అద్భతమైన ఫిల్డర్ ప్రతి మ్యాచ్ లో ఓ 20 పరుగులు ఆదా చేస్తాడు. ఇదే ఫార్ములాని ధోని ఫాలో అయ్యాడు. సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు ధోని కూడా సీనియర్ అయ్యాడు. ఆయనలో మునుపటి జోరు కనిపించడం లేదు. ప్రపంచకప్ లో అది కనబడింది. ఆయనకి ప్రత్యామ్నాయంగా యువ ఆటగాళ్లు వచ్చారు. అది ధోనికి తెలుసు. ఈ నేపథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. ఆ వెంటనే ఘనంగా వీడ్కోలు చెప్పవచ్చని ధోని భావించి ఉంటాడు. కానీ, అది జరగలేదు. ఐతే ఇప్పుడు విండీస్ టూర్ కి ధోనిని ఎంపిక చేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు, ధోని రిటైర్డ్మెంట్ పై సీనియర్లు ఎటాక్ చేస్తున్నారు. అసలు ధోనీ ఉద్దేశం, ప్రణాళికలు ఏంటో అడిగి తెలుసుకోవాలని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, సీనియర్ ఆటగళ్లు సెహ్వాగ్‌, గంభీర్‌ అంటున్నారు. ధోనీ వికెట్‌కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టులో కొనసాగాలి. ఏ ఆటగాడూ ఆడకుండా జట్టులో ఉంటూ మార్గనిర్దేశకుడిగా ఉండలేడని చెబుతున్నారు. మరీ.. ధోని మనసులో ఏముందో ? తెలియాల్సి ఉంది.