బిగ్ బాస్ హౌస్‌’లో సావిత్రక్క.. కన్ఫామ్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్3 వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. ఐతే, షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌ వివరాలు ఇంకా బయటికిరాలేదు. ఈ నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ‘తీన్మార్’ యాంకర్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ 3లో కనిపించబోతుందనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. ఇప్పుడీ ప్రచారం నిజమైంది. ఈ విషయాని ఖరారు చేస్తూ శివజ్యోతి తన ఇన్ స్ట్రోరామ్ లో పోస్ట్ పెట్టింది. కొద్దిసేపటికే ఆ పోస్ట్ ని తీసేసింది కూడా. బహుశా.. బిగ్ బాస్ కండీషన్స్ గుర్తొచ్చే పోస్ట్ ని తొలగించి ఉంటుంది.

ఇక, బిగ్ బాస్ 3 కంటెస్టర్స్ గా ప్రచారం జరుగుతున్న లిస్టులో సావిత్రి, యాంకర్‌ శ్రీముఖి, హేమ, వరుణ్‌ సందేశ్‌, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్‌ జాఫర్‌, ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు పేర్లు విపిస్తున్నాయి. బిగ్ బాస్ 3 100రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం 15మంది కంటెస్టర్ పాల్గొననున్నారు. సీజన్ 1,2లని మించేలా సీజన్ 3 ప్లాన్ చేసినట్టు సమాచారమ్. మరీ.. నాగ్ బిగ్ బాస్ షోని ఎలా రక్తికట్టిస్తారన్నది చూడాలి.