ముగ్గురు పిల్లల నటి.. బిగ్ బాస్ హౌస్‌’లో ప్రేమలో పడింది.. !!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్ 3 కోసం ప్రేక్షక్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 మాత్రం అప్పుడే ప్రారంభం అయింది. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కంటెస్టర్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఒకరు. వనితా విజయకుమార్‌. ఈ నటికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా.. బిగ్ బాస్ హౌస్‌’లో ప్రేమలో పడిందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వనితా స్పందించారు.

బిగ్ బాస్ హౌస్‌లో తనకెలాంటి కొరత జరగలేదు. తానేమిటో అందరికీ తెలుసు. హౌస్‌లో ఆడమగ ప్రేమలో పడుతుంటారు. అదే విధంగా తానూ ప్రేమలో పడతానని ప్రేక్షకులు భావించి ఉంటారు. కానీ అందులో నిజం లేదు. తానెవరినీ ప్రేమించలేదు. అలాంటి తప్పు తాను చేయను. తాను ముగ్గురు పిల్లలకు తల్లిని. తనకు బాధ్యత ఉందని చెప్పుకొచ్చింది. ఇక, వనిత విజయ్ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఐతే, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.