గుడ్ న్యూస్ : ఇకపై రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. మన రైతుబంధు, మన భగీరథ, మన ఫింఛన్ విధాన్ని కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. ఓ వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు, చట్టాల సవరణలతో తనదైన మార్క్ పాలనని కొనసాగిస్తున్నారు సీఎం కేసీఆర్.

తాజాగా ‘తెలంగాణ పురపాలక చట్టం-2019’ తీసుకొచ్చారు. తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తెలంగాణ పురపాలక చట్టం-2019పై చర్చ జరుగుతోంది.ఈ చట్టం ఆవశ్యకత, ముఖ్యాంశాలు, లక్ష్యాలు, ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సీఎం తెలిపారు. దీనిపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.