ఆగస్టు30కి ‘సాహో’ వాయిదా.. నిజమే !


ఆగస్టు15న రావాల్సిన ప్రభాస్ ‘సాహో’ ఆగస్టు30కి వ్వాయిదా పడనుందనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఇప్పుడీ ప్రచారం నిజం కాబోతుంది. ఈ మేరకు ఈరోజు సాహో యూనిట్ నుంచి ఓ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. యూనిట్ తరపున పీఆర్ టీమ్ కానీ, జస్ట్ ఓ ప్రకటన కానీ విడుదల చేస్తారని తెలిసింది.

పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో జాప్యమే సాహో వాయిదాకి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా VFX పనులు పూర్తికావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో సాహో వాయిదా వేయకతప్పలేదు. ఐతే, సెప్టెంబర్ 13కి వెళ్దామని అనుకొన్నారు. కానీ అలా చేస్తే సైరా సినిమాకు ఇబ్బంది అవుతుంది. ఈ రెండింటికి గ్యాప్ జస్ట్ రెండువారాలే వుంటుంది. అందుకనే.. ఆగస్టు30నే ఫిక్సయ్యారు. వినాయకచవితి కూడా కలిసి వస్తుంది. బాలీవుడ్ లో కూడా వినాయకచవితి హడావుడి గట్టిగానే వుంటుందని 30కే ఫిక్సయినట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో సాహో వాయిదాపై అప్ డేట్ రానుంది.