గ్రేట్ : గోనె సంచులతో ఖరీదైన కోటు
ఓ కోటు(బ్లేజర్) కొనాలంటే వేలల్లో ఖర్చవుతుంది. మంచి కోటు కావాలంటే రూ. 10000వేలకి పైనే ఖర్చుపెట్టాలి. కానీ, రూ. 10లతో ఆకర్షనీయమైన కోర్టుని తయారు చేశాడు జగిత్యాల యువకుడు. చినిగిపోయిన మూడు గోనె సంచులతో మూడు గంటల్లో కోటు(బ్లేజర్)ను తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన వీరబత్తిని మోహన్ టైలరింగ్ చేస్తుంటాడు. గురువారం ఓ వ్యక్తి వద్ద చినిగిపోయిన మూడు బియ్యం సంచులను రూ.10కి కొనుగోలు చేశాడు. వాటిని కత్తిరించి ఆకర్షణీయంగా కోటును తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడీ కోర్టు నెటిజన్స్ బాగా ఆకట్టుకుంటోంది. గోనె సంచి కోర్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే ట్రెండుగా మారిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !