బిగ్ బాస్3 కంటెస్టెంట్స్.. పూర్తి లిస్టు లీక్ !


బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరించనున్నాడు. షోలో పాల్గొనబోయే కంటేస్టెంట్స్ లిస్ట్ ఇంకా బయటికి రాలేదు. తాజాగా ఈ లిస్టుని లీక్ చేశాడు బిగ్‌బాస్-2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు. బిగ్ బాస్ 3లో పాల్గొన బోయే కంటెస్టెంట్స్ వందశాతం వీరే అంటూ ఓ లిస్టుని విడుదల చేశారు.

ఆ లిస్టులో.. సీనియర్ నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ యాంకర్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట), సీరియల్ యాక్టర్ రవికృష్ణ, టీవీ యాంకర్ అలీ రెజా, టీవీ9 జర్నలిస్ట్ జాఫర్, పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్, యూట్యూబ్ స్టార్ మహేష్, టీవీ నటి రోహిణి, డస్మాష్ స్టార్ అషూ రెడ్డి ఉన్నారు.

ఇక, బిగ్‌బాస్-3 వందరోజుల పాటు కొనసాగనుంది. 15 మంది సెలబ్రేటీలు పాల్గొననున్నారు. సీజన్1, 2 లని మించేలా కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3ని డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం బిగ్ బాస్ యాజమాన్యం కొన్ని సప్రైజెస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అవేంటీ.. అన్నది టీవీలో చూసి తెలుసుకోవాల్సిందే.