జనసేన భోనాల సాంగ్ విన్నారా.. ?

తెలంగాణలో ఇప్పుడు భోనాల సీజన్. భోనెమెత్తి.. అమ్మవారికి సాకపెట్టి సల్లంగా చూడమని మొక్కుతుండ్రు. ఈ పండగకి మరింత ఊపుతెచ్చేలా కొత్త కొత్త భోనాల పాటలని గైకడుతుండ్రు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ భోనాల సాంగ్ ని విడుదల చేశారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సాంగ్ ని విడుదల చేశారు. ఐతే, ఈ సాంగ్ అంత ధూమ్ ధామ్ గా ఏమీలేదు. పైగా.. ఇంకా జనసేన.. టీడీపీ సపోర్ట్ అన్నట్టుగా పచ్చచొక్కతో చిందేయడం వీడియోలో చూడొచ్చు.

ఇక, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం కనబడుతుందని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఫలితాలొచ్చాయ్. వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 151స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనసేన ఒక్కస్థానానికి మాత్రమే పరితమైంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అయినా.. వెన్నుచూపులేదు. ప్రజా సమస్యలపై జనసేన పోరాడుతూనే ఉంటుందని ప్రకటించి.. పవన్ జనాల మనసులు గెలిచాడు. ఇక, ఈ విషయం పక్కన పెట్టేసి.. జనసేన భోనాల పాటని వినేయండీ.. ఓసారి !