విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్న రాజమౌళి కూతురు !


రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తర్వాత యూత్ ని ఆ రేంజ్ లో ఆకట్టుకొన్న టాలీవుడ్ హీరో విజయ్ అనే చెప్పాలి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు యూత్ ని తెగ ఆకట్టుకొన్నాయి. వీటిలో గీత గోవిందం యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులని మెప్పించింది. ఇక విజయ్ లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయన చిత్రం డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహిస్తున్న సంగీతోత్సవానికి అమ్మాయిలు అధిక సంఖ్యలో హారవుతున్నారు. హీరోయిన్ రస్మికతో కలిసి విజయ్ ఆట, పాట, మాటలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయ్.

శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ‘డియర్ కామ్రేడ్’ సంగీతోత్సవానికి దర్శకధీరుడు రాజమౌళి కూతురు మయూఖ కూడా సందడి చేసింది. మయూఖ రౌడీ టీ షర్ట్ వేసుకొని మరీ.. ఎంజాయ్ చేసింది. చూస్తుంటే.. మయూఖ విజయ్ దేవరకొండకి బిగ్ ఫ్యాన్ లా కనిపిస్తోంది. అయినా.. సాధారణ అమ్మాయిలా డియర్ కామ్రేడ్ సంగీతోత్సవంలో పాల్గొని సందడి చేసింది. ఇక, రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ప్రస్తుతం తారక్, రామ్ చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తే.. అందిరి కంటే ముయూఖ హ్యాపీగా ఫీలయ్యేలా ఉంది.