ఏపీలో రాష్ట్రపతి పాలన ?
సీఎం వైఎస్ జగన్ మొండి వైఖరి వీడకుంటే ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదంటున్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. పీపీఏల విషయంలో రివ్యూలపై జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉందంటున్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తుచేశారు. పీపీఏ వ్యవహారంతో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని యనమల అన్నారు.
మరోవైపు, పీపీఏల విషయంలో జగన్ సర్కార్ అస్సలు తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన పీపీఏలను సవరిస్తామని చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారంతో డిస్కం సంస్థల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని.. కాబట్టి సమీక్ష తప్పదని చెబుతున్నారు. అదే జరిగితే.. యనమల చెప్పినట్టు ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుందేమో చూడాలి. ఏదేమైనా.. కరెంట్ విషయంలో సీఎం జగన్ కాస్త దూకుడు తగ్గిస్తే మంచిదేమో !