‘అవతార్’ మించిపోయిన ‘ఆవెంజెర్స్’ !

వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ ఇన్నాళ్లు హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ పేరిట ఉండేది. ఈ చిత్రం 2.7897 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ రికార్డుని మరో హాలీవుడ్ చిత్రం బ్రేక్ చేయలేదని అవతార్ నిర్మాతలు గొప్పగా చెప్పుకొనేవారు. ఐతే, ఇప్పుడీ రికార్డుని ‘ఆవెంజర్స్’ బ్రేక్ చేసింది.

మొదటిసారి విడుదలతో ‘అవతార్’ రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు. కానీ, రెండో సారి విడుదలతో అవతార్ వసూళ్ల రికార్డుని చెరిపేశారు. రెండవసారి ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ను విడుదలచేసేటప్పుడు కొత్తగా చాలా సన్నివేశాలను కలిపారు. ఇది బాగా కలిసొచ్చింది. అప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కొత్త సన్నివేశాల కోసం మరోసారి చూశారు. దాంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయ్.

ప్రస్తుతానికి ఆవెంజర్స్ కలెక్షన్స్ 2.7892 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకున్నారు. వీకెండ్ వసూళ్లను కూడా కలిపితే ఈ మొత్తం 2.7897 బిలియన్ డాలర్లను దాటిపోతుంది. దీంతో అవతార్ రికార్డుని ఆవెంజర్స్ బ్రేక్ చేసినట్టే. ఇక, 2021 డిసెంబర్ 17న విడుదలకానున్న ‘అవతార్ 2’ విడుదల కాబోతుంది.