గుండె పోటుతో కమెడియన్ మృతి !

స్టాండప్ కమెడియన్‌, నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు మంజునాథ్ నాయుడు. ఆయన స్టేజిపై నవ్విస్తూనే తుదిశ్వాస విడవడం అందరి మనసులని కలచివేస్తోంది. చెన్నైకి చెందిన మంజునాథ్ నాయుడు కొంత కాలంగా దుబాయ్‌లో నివసిస్తున్నారు.

అక్కడ శుక్రవారం షో చేస్తూ సడెన్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయను హాస్పిటల్‌కు తరలించినా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. ముందుగా స్కిట్ లో భాగంగానే మంజునాథ్ కిందపడిపోయాడని వీక్షిస్తున్న ప్రేక్షకులు భావించారు. ఐతే, ఎంతకి లేవకపోవడంతో దగ్గరికెళ్లి చూసే సరికి గుండెపోటు వచ్చిందని అర్థమైంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.