‘మన్మథుడు 2’ తొలి పాట విన్నారా ?

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఆగస్ట్‌ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలిపాటని విడుదల చేశారు. ‘హే మెనీనా.. ఐ సీయూ వాన్న లవ్‌’ అంటూ సాగే ఈ పాటలో నాగ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఇందులో నాగ్ ఈజీగా అమ్మాయిలని పడేయడం చూపించారు. ఈ పాటలో ఏకంగా ముగ్గురి ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం చూడొచ్చు. మన్మథుడు టైటిల్ కి సరిగ్గా సూటయ్యే సాంగ్ లా కనిపిస్తోంది.

నాగ్ బ్లాక్ బస్టర్ ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని భావిస్తున్నారు. ఐతే, మన్మథుడు కథకి రివర్స్ లో రెండో మన్మథుడుగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల టీజర్ కి మంచి స్పందన వచ్చింది. నాగ్, రకుల్ ల్లో రెండు షేడ్స్ ఉన్నట్టు టీజర్ లో చూపించారు. ముందు పద్దగా కనిపించిన వీరిద్దరు.. ఆ తర్వాత బోల్డ్ కనిపించారు. అలా మారడానికి కారణాలని దర్శకుడు వినోదాత్మకంగా మలిచినట్టు కనిపిస్తోంది. ఇక, నాగ్ అప్పడు ఇప్పుడు ఎప్పుడూ మన్మథుడే అన్నట్టుగా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నారు. మన్మథుడు 2 హిట్ అయితే.. నాగ్ అందంపై మరోసారి పెద్ద చర్చే సాగడం ఖాయం.