అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్
అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు.
కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్