మై’త్రీ’ విడిపోయింది.. !

మైత్రీ మూవీస్ సంస్థలో ముగ్గురు భాగస్వాములు. నవీన్, రవిశంకర్, మోహన్ సివి. వీరు ముగ్గురు ఒకే ప్రాంతానికి చెందిన వారు. స్నేహితులు కూడా. అందుకే మై.. ‘త్రీ’ అర్థం వచ్చేలా నిర్మాణ సంస్థ పేరుని పెట్టుకొన్నాడు. అతి తక్కువ కాలం లోనే ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థగా పేరుతెచ్చుకొన్నారు. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నారు. ఒకేసారి ఐదారు సినిమాలు నిర్మిస్తూ.. స్టార్ హీరోలకు ముందే అడ్వాన్సులు ఇస్తూ దూసుకెళ్తున్నారు.

ఇలాంటి సమయంలో మై’త్రీ’లో ప్రకంపనలు. నవీన్, రవిశంకర్, మోహన్ సివి ల మైత్రీ చెడింది. ఇకపై మై’త్రీ’ మూవీస్ లో మై ‘టూ’ నవీన్, రవిశంకర్ మాత్రమే కొనసాగనున్నారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి మోహన్ తప్పుకుంటున్నారు. ఇందుకు చాలా కారణాలున్నాయన్నది ఇండస్ట్రీ టాక్. ఇందులో ఒకటి మహేష్-సుకుమార్ సినిమా క్యాన్సిల్ కావడం కూడా ఒకటి.

ఇన్నాళ్లు మైత్రీలో ముగ్గురు నిర్మాతలైన ఇద్దరు మాత్రమే నవీన్, మోహన్ సివి పెట్టుబడి పెట్టేవారట. రవిశంకర్ నిర్వహణ భాగస్వామి మాత్రమే. ఇప్పుడు రవిశంకర్ కూడా పెట్టుబడి భాగస్వామి కాబోతున్నాడు. పైగా మోహన్ తరచు అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి సినిమా వ్యవహారాలు చూసుకోలేకపోవడం కుదరడం లేదట. అందుకే ఆయన మైత్రీ నుంచి సైడ్ అవుతున్నట్టు సమాచారమ్.