దేశంలోనే.. ట్రెండింగ్ టాప్’లో బిగ్ బాస్ 3 !

తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ హిట్టయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో షోని రక్తికట్టించాడు. రికార్డు టీఆర్పీ రేటింగ్స్ ని నమోదు చేసింది సీజన్1. అంతకుమించి తెలుగు బిగ్ బాస్ ని ప్రతి ఇంటికి, ఆ ఇంట్లోవారి ఫేవరేట్ షోగా చేయడంలో తారక్ సక్సెస్ అయ్యాడు, ఇక సీజన్ 2కి హోస్ట్ గా వ్యవహరించిన నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తగా షోని నడిపారు.

ఇప్పుడు సీజన్ 3 కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగాడు. ప్రారంభంతోనే తనదైన శైలిలో అదరగొట్టేశాడు. సెలబ్రేటీలని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించడంతో నాగ్ మేజిక్ స్టార్ అయింది. ఇప్పుడు ఈ షో దేశంలోనే ట్రెండింగ్ లో టాప్ గా నిలిచింది. ఈ విషయాన్ని స్టార్ ‘మా’ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొదటిరోజే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొంది. ఇకపై మాములుగా ఉండనుంది హింట్ ఇచ్చినట్టయింది. వందరోజుల పాటు బుల్లితెర అభిమానులకి ఫుల్ వినోదం దొరికేసినట్టే.. !