వివాదం : ఇస్మార్ట్ కాన్సెప్ట్ హీరో ఆకాష్’ది అట


‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర హవా చూపిస్తోంది. కేవలం 4 రోజుల్లో 48కోట్లు కలెక్ట్ చేసింది. సోమవారం నాటి కలెక్షన్స్ తో ఇస్మార్ట్ కలెక్షన్స్ రూ. 50కోట్లని దాటేసినట్టే. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందానికి బిగ్ షాక్ తగిలింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కాన్సెప్ట్ నాదే అంటూ హీరో ఆకాష్ మీడియా ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలని కూడా చూపించారు.

‘ఆనందం’ ఫేం ఆకాష్‌ హీరో మాత్రమే కాదు. రచయిత కూడా. “ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో నన్నే హీరోగా పెట్టి దర్శకురాలు రాధా ఓ సినిమా తీశారు. ఆ చిత్రం తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైంది. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో షాక్ తగిలింది” అన్నారు ఆకాష్. దీనిపై దర్శకుడు పూరిని సంప్రదించాలని ప్రయత్నించాం. కానీ కుదరలేదు. సామరస్యంగా సమస్య పరిష్కారం కానీ పక్షంలో లీగల్ గా వెళతామని అన్నారు ఆకాష్.