అఖిల్ హీరోయిన్.. ముహూర్తాలు చూస్తున్నారు !


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎవరూ సెట్ కాలేదు. సో.. ఎప్పట్లానే అఖిల్ సరసన ఓ కొత్తమ్మాయిని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు ఓ అమ్మాయిని ఫైనలైజ్ చేశారు కూడా. ఆ అమ్మాయి పేరును ప్రకటించేందుకు మంచి ముహూర్తం చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. అఖిల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. హీరోయిన్ దొరకలేదన్న లోటుతో రెండో షెడ్యూల్ కాస్త లేటయింది. త్వరలోనే హీరోయిన్ పేరుని ప్రకటించి.. రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. అఖిల్ కి ఇప్పటి వరకు హిట్ పడలేదు. మూడు సినిమాలు ప్లాపులే. ఈ నేపథ్యంలో అఖిల్ కి ఈ సినిమా చాలా కీలకం. ఇక, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఆడకుంటే.. ఆయన కంప్లీట్ గా షెడ్డుకే. అందుకే కసితో అఖిల్ సినిమా చేయబోతున్నాడు.