జయవర్దనెకు రోహిత్ సపోర్టు ?


వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో విబేధాలు తలెత్తాయ్. జట్టుగా రెండుగా విడిపోయింది. కోహ్లీ వర్గం, రోహిత్ వర్గంగా మారిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రోహిత్ కి కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ గా కోహ్లీ కంటే రోహిత్ బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో రోహిత్ తనకి అనుకూలంగా కోచ్ ని పోటీకి నిలబెడుతున్నారు. ముంబై ఇండియన్స్ కోచ్ గా వ్యవహరించిన జయవర్థనె రోహిత్ సపోర్టుతోనే టీమిండియా కోచ్ పదవికి పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కోచ్ రవిశాస్త్రీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మరోసారి రవిశాస్త్రీయే కోచ్ గా ఎన్నికైతే కష్టమని రోహిత్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జయవర్థనెని రోహిత్ రంగంలోకి దింపనున్నాడనే చెప్పుకొంటున్నారు. ఐపీఎల్‌లో ముంబయికి జయవర్దనె 2 సార్లు ట్రోఫీ అందించాడు. కొన్నాళ్లు ఇంగ్లాండ్‌కు తాత్కాలిక కోచ్‌గానూ ఉన్నారు. అతడితో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ పోటీపడతారని తెలుస్తోంది. కోచ్’గా జయవర్థనె ఎంపికైతే.. ఇక టీమిండియాలో రోహిత్‌ ప్రాబల్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి.మరీ నిజంగా టీమిండియా కోచ్ పదవికి జయవర్థనె పోటీ చేస్తారా ?చూడాలి