సీఎం రాజీనామా పుకార్లు
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈరోజు రాత్రి 9 గంటల్లోపు సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్ సూచించినా.. దానికి అధికార పక్షం సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో సభలో అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం కొనసాగుతోంది. మరోవైపు సీఎం ముఖ్యమంత్రి కుమార స్వామి రాజీనామా చేశారనే ప్రచారంలో సోషల్ మీడియాలో జరుగుతోంది.
దీనిపై సీఎం స్పందించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సంతకాలతో ఉన్నవి తప్పుడు పత్రాలని కుమారస్వామి స్పష్టం చేశారు. ఆ పత్రాలను ఆయన సభలో చూపించారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకొంటామని సీఎంవో ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి.