మెగాస్టార్’కు పూరి సవాల్


‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ కిక్కులో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవికే సవాల్ విసిరాడు. సక్సెస్ లో ఉన్న దర్శకుడికే మహేష్ ఛాన్స్ ఇస్తాడంటూ పూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ కే సవాల్ విసరడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో 4 సార్లు సినిమా మిస్సయింది. అందులో 2 సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఐతే, ఈసారి అవకాశం ఇస్తే కేవలం 5రోజుల్లో మెగాస్టార్ కోసం కథని రాస్తానని సవాల్ విసిరాడు పూరి.

చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతోనే సినిమా చేయలేకపోతున్నాను. చిరంజీవి 150వ సినిమాకు ముందు ఎంటర్ టైన్ మెంట్ స్టోరీ అనుకున్నాం. మళ్లీ ఆయన మనసు మార్చుకున్నారు. సమాజానికి ఏదైనా చేద్దామని చెప్పి కత్తి సినిమాను రీమేక్ చేశారని తెలిపారు. పూరి-చిరు కాంబినేషన్ ‘ఆటోజానీ’ మాత్రమే గుర్తొస్తుంది. కానీ మెగాస్టార్ తో 4సార్లు ఛాన్స్ మిస్సయిందని చెప్పి పూరి షాక్ ఇచ్చారు. మరీ.. పూరి తాజా సవాల్ కి మెగాస్టార్ స్పందిస్తారా ? ఆయనకి ఛాన్స్ ఇస్తారా ?? అన్నది చూడాలి.