‘డియర్ కామ్రేడ్’ జ్యూక్ బాక్స్.. వచ్చేసింది !

కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. దక్షిణాది అన్ని బాషాల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. సినిమాలో మొత్తం 8 పాటలున్నాయి. ఇందులో డియర్ కామ్రేడ్ ఆంథమ్ ని స్వయంగా విజయ్ దేవరకొండ ఆలపించారు.

ఇక సినిమా బాహుబలిని దాటేసింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరిగిరాసిన సినిమా బాహుబలి. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇదొకటి. ఐతే, ఈ సినిమా కన్నడలో మాత్రం విడుదల కానుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మాత్రం దక్షిణాది అన్నీ బాషల్లో ఏకకాలంలో ఈ నెల 26న విడుదల కానుంది. ఇక, డియర్ కామ్రేడ్ పాటలని మీరు వినేయండీ!