ఎన్టీఆర్ కోసం మరో హాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ !


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఫిక్సయిపోయారు. తారక్‌కు జోడీగా డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ అనే బ్రిటిష్‌ భామను ఎంపికచేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా ప్రారంభానికి ముందే తప్పుకొన్నారు. అప్పట్నుంచి తారక్ కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు జక్కన్న. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లని పరిశీలించారు.

ఫైనల్ గా హాలీవుడ్‌ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. ఎమ్మా రాబర్ట్స్ పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆమె నటిస్తున్న తొలి ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ కానుంది. ఈ విషయమై చిత్రబృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు రూ.400కోట్లపైగా బడ్జెట్’తో డీవీవీ దానయ్య సినిమాకు నిర్మిస్తున్నారు
2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.