ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్


ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. సభలో తొలి సస్పెన్షన్ జరిగింది. ముగ్గురు టీడీపీ సభ్యులని స్పీకర్ సస్పెండ్ చేశారు. నిమ్మకాయల చిన్నరాజప్ప, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడులు సస్పెండ్ కు గురయ్యారు. మంత్రి బుగ్గున ఈ ముగ్గురి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ని సూచించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఈ ముగ్గురిపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ తెలిపారు.

ఈ సస్పెన్షన్ ని అధికార పక్షం సమర్థించుకొంది. గతంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తులేదా అని ప్రశ్నించారు. సభని సజావుగా సాగకుండా టీడీపీ సభ్యులు కావాలనే కాలయాపన చేస్తున్నారని, సభ్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తామని తెలిపారు. ఇక, 45యేళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ మహిళలకి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దానిపై ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేశారని సస్పెండ్ కు గురైన టీడీపీ సభ్యులు ఆరోపించారు.