హ్యాపీ బర్త్ డే చాహల్‌


టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ బర్త్ డే నేడు. 29వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకి స్నేహితులు, సహచరుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. బీసీసీఐ సోషల్‌మీడియాలో చహల్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. చాహల్‌ టీవీకి సంబంధించిన సరదా ఘటనలను ఒక వీడియోగా రూపొందించి హ్యాపీ బర్త్‌డే గూఫీ అని పోస్టు చేసింది.

టీమిండియా ఓపెనర్లు రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌ వేర్వేరు పేర్లతో చాహల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధావన్‌ బర్త్‌డేబాయ్‌ని సమోసా ట్రీట్‌ ఇవ్వమని సరదాగా పోస్టు చేశాడు. ఇక రోహిత్‌శర్మ ట్వీట్‌ చేస్తూ.. అత్యుత్తమ పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పిచ్ ఎలా ఉన్న వికెట్లు పడగొట్టడం చహల్ ప్రత్యేకత. ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. విండీస్ టూర్ కి అన్ని ఫార్మెట్లలో ఎంపికన ఆటగాడు చహల్.