బ్రేకింగ్ : కర్ణాటకలో కూలిన కుమార స్వామి ప్రభుత్వం


ఎట్టకేలకు కర్నాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. విశ్వాసపరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం కూలిపోయింది. స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వానికి 99 ఓట్లు మాత్రమే దక్కాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105ఓట్లు పడ్డాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి కూలిపోయినట్టు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు.

వాస్తవానికి ఈ నెల 18నే విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఐతే, సంకీర్ణ ప్రభుత్వం రెబల్ ఎమ్మెల్యేలని బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఇందుకోసం విశ్వాస పరీక్షని వివిధ కారణాల వలన వాయిదా వేస్తూ వస్తోంది. ఆఖరి నిమిషం వరకు మరో రెండు రోజులు అవిశ్వాస పరీక్షకు వాయిదా వేసేందుకు ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. అందుకోసం స్పీకర్ కూడా ఒప్పుకోలేదు. ఇక, విశ్వాస పరీక్షకు ముందు సీఎం కుమారస్వామి అసెంబ్లీలో భావోద్వేగంగా మాట్లాడారు.