‘నాన్న నేను’ ఫిక్సయ్యాం !
త్రివిక్రమ్-అల్లు అర్జున్ లది హింట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయ్. ప్రస్తుతం బన్నీ-త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఇది కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహా తండ్రి సెంటిమెంట్ తో తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. తండ్రి సెంటీమెంట్ తో పాటు తల్లి సెంటిమెంట్ బలంగా ఉండనుంది. బన్నీ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి టబు నటిస్తున్నారు. ఆమె బుధవారమే షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
ఈ సినిమా కోసం ‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే టైటిల్స్ వినిపించాయి. వీటిలో ‘నాన్న నేను’ టైటిల్ దాదాపు ఫిక్సయిందని లెటెస్ట్ సమాచారమ్. ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నివేదా పేతురాజు మరో హీరోయిన్. టబు, జయరాం, సుశాంత్, మురళీ శర్మ, రావూ రమేష్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.