#Adheera ఎవరు ?

కన్నడ స్టార్ యశ్ ‘కేజీఎఫ్’ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ని తెచ్చుకొంది. బాలీవుడ్ ప్రేక్షకులు ‘కేజీఎఫ్’కు ఫిదా అయ్యారు. ఏకంగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పడీ సినిమా సీక్వెల్ రెడీ అవుతోంది. తాజాగా ‘కేజీఎఫ్ 2’ అప్ డేట్ వచ్చేసింది. ఈ నెల 29న #Adheera లుక్ ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రీ లుక్ ఒకటి వదిలారు. ఇందులో ఓ వ్యక్తి చేతులు వెనక్కి కట్టుకొని కనిపిస్తున్నాడు. ఆయన వేలికి పెట్టుకొన్న ఉంగరంపై సింహాం కనిపిస్తోంది.

ఇంతకీ #Adheera ఎవరు ? సీక్వెల్ లో యష్ అధీరగా కనిపించబోతున్నాడా.. ? లేదంటే సీక్వెల్ లో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లుక్ అనే చర్చ జరుగుతుంది. #Adheera సంజయ్ అయి ఉంటాడనే టాక్ వినిపిస్తొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సిరీస్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పలువురు బాలీవుడ్ నటీనటీలు నటిస్తున్నారు.