రివ్యూ : డియర్ కామ్రేడ్


చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)

నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన,

సంగీతం :  జస్టిన్ ప్రభాకరన్

దర్శకత్వం : భరత్ కమ్మ

నిర్మాత : మైత్రీ మూవీస్

రిలీజ్ డేటు : 26జులై, 2019

రేటింగ్ : 3.5/5

స్టార్ హీరో అంతకుమించి అనిపించుకొన్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా హిట్స్ తో స్టార్ హీరోలని మించిన క్రేజ్ ని సంపాదించుకొన్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తర్వాత యూత్ ఆ రేంజ్ లో క్రేజ్ కలిగిన హీరో విజయ్ నే అని చెప్పవచ్చు. అలాంటి విజయ్ నుంచి సినిమా వస్తుందంటే.. ఎలా ఉంటుంది ? ఎన్ని అంచనాలు ఉంటాయ్ ?? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘డియర్ కామ్రేడ్’ ఇలాంటి అంచనాలే ఉన్నాయి. మరీ.. ఆ అంచనాలని కామ్రేడ్ అందుకొన్నాడా ? కామ్రేడ్ కథేంటీ ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

బాబీ (విజయ్ దేవరకొండ) స్టూడెంట్ లీడర్. ఆయనది రాడికల్ ఐడియాలజీ. అగ్రెసివ్ నేచర్. స్టూడెంట్ లీడర్ కాబట్టి గ్యాంగ్ లు, గొడవలు సర్వసాధారణం. ఇక, లిల్లీ (రష్మిక మందన) మంచి క్రికెట్ ప్లేయర్. లిల్లీ ప్రేమను గెలుచుకునేందుకు అనేక ప్రయత్నాల తర్వాత బాబీ సక్సెస్ అవుతాడు. ఐతే, బాబీని కోపాన్ని తగ్గించుకోమని లిల్లీ పదే పదే చెబుతోంది. కానీ, అది జరగదు. కొన్ని కారణాల వలన బాబీ-లిల్లీ విడిపోతారు. దాని వెనక కారణాలేంటీ ? చివరికి వీళ్లు కలిశారా ?? అన్నది కామ్రేడ్ కథ.

ప్లస్ పాయింట్స్ :

* విజయ్, రస్మికల నటన

* కథ

* నేపథ్య సంగీతం

* కాలేజ్ ఏపీసోడ్

* ఆఖరి 5నిమిషాలు (క్లైమాక్స్)

మైనస్ పాయింట్స్ :

* స్లో నేరేషన్ (ముఖ్యంగా సెకాంఢాఫ్ లో)

* ఎడిటింగ్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

భరత్ కమ్మ ఎంచుకొన్న కథ, దాన్ని తెరపై చూపించిన విధానం బాగుంది. సన్నివేశాలని చాలా సహజంగా చూపించారు. కాలేజ్ ఏపీసోడ్, లవ్ ట్రాక్ యూత్ కి కిక్కునిచ్చేలా ఉన్నాయి. ఐతే, ఫస్టాఫ్ రేంజ్ లో సెకాంఢాఫ్ లేదు. స్లో నేరేషన్ ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెట్టింది. ఓపిగ్గా చూస్తే మాత్రం ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాడు. దర్శకుడుగా భరత్ కమ్మ తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మహిళలకి సంబంధించిన బర్నింగ్ పాయింట్ ఒకటి చూపించారు.

ఇక, విజయ్ దేవరకొండ నటనకి వంక పెట్టలేం. బాబీ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లిల్లీగా రస్మిక ఫర్ ఫెక్ట్ గా సరిపోయింది. బ్యాట్ పట్టినా.. రొమాన్స్ చేసినా.. లీనమై చేసింది. విజయ్-రస్మికల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామ్రేడ్ గ్యాంగ్, మిగితా నటీనటీలు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

కామ్రేడ్ టెక్నికల్ గా బాగున్నాడు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు వినడం కన్నా.. తెరపై చూడ్డానికి ఇంకా బాగున్నాయి. పాటల్లోనే లవ్ ట్రాక్ చూపించడం ఆకట్టుకొంది. ఎడిటింగ్ మాత్రం పెద్ద మైనస్ గా మారింది. సెకాంఢాఫ్ లో 10-15నిమిషాల సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు. వాస్తవానికి దర్శకుడు రెండున్నర గంటల సినిమాకే లాక్ చేశారు. దాన్ని విజయ్ దేవకొండ మరో 15నిమిషాలు పెంచడానికి సమాచారమ్. ఇప్పుడదే పెద్ద్ అమైనస్ అయింది. ఇక, నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : కామ్రేడ్ కేక.. !

రేటింగ్ : 3.5/5