‘డియర్ కామ్రేడ్’ ట్విట్టర్ రివ్యూ

ప్రేక్షకులకే షాక్ ఇవ్వడం హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేకత. ‘అర్జున్ రెడ్డి’గా విజయ్ నటన చూస్తే ప్రేక్షకుల నోట మాట రాలేదు. ఏం చేశాడ్రా బాబు.. ఇరగదీశాడని చెప్పుకొన్నారు. ఆ వెంటనే ‘గీత గోవిందం’, ‘టాక్సీవాల’తో వరుస షాకులు ఇస్తూనే ఉన్నాడు. విజయ్ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన కథానాయిక. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్ చూస్తే విజయ్ మరోసారి ప్రేక్షకులకి షాక్ ఇచ్చేలా కనిపించాడు.

భారీ అంచనాల మధ్య ‘డియర్ కామ్రేడ్’ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లో ఒకేసారి ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ సినిమా టాక్ ని పంచుకొంటున్నారు. డియర్ కామ్రేడ్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కథలో బలం ఉంది. దాన్ని స్క్రీన్ పై అంతే బలంగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఐతే, ఫస్టాప్ బాగుందని చెబుతున్న నెటిజన్స్ సెకాంఢాఫ్ మాత్రం సాగదీసినట్టు ఉంది. మరో 10-15నిమిషాలు ట్రిమ్ చేస్తే సినిమా ఇంకా బాగుండేదని చెబుతున్నారు. కొందరు యావరేజ్ గా ఉందని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్-రస్మిక జంట మరోసారి మాయ చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. సినిమా పడుతూ లేస్తూ సాగినట్టు అనిపించింది. మొత్తంగా.. డియర్ కామ్రేడ్ పై పాజిటివ్ టాక్ ఎక్కువగా నడుస్తోంది. రియల్ లవ్ స్టోరీ, రియలిస్టిక్ గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అదే సమయంలో సినిమా కాస్త స్లో సాగింది. ప్రత్యేకంగా సెకాంఢాప్ లో అదొక్కటే డియర్ కామ్రేడ్ కు పెద్ద మైనస్ గా చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేస్తే.. ఆ మైన స్ కూడా ప్లస్ అవుతుందని సలహా ఇస్తున్నారు నెటిజన్స్. మొత్తంగా కామ్రేడ్ కేక అంటున్నారు.