రకుల్ రేటు కోటిన్నర !

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి స్వీడెక్కువ. దూసుకుపోయే గుణం. చాలా స్వీడుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో ఆడిపోయింది. ఈ క్రమంలో ఓ రికార్డు కూడా తన ఖాతాలో వేసుకొంది. మెగా హీరోల్లో ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తప్ప మెగా హీరోలందరితో ఆడిపాడింది. ఇక్కడ కాస్త జోరు తగ్గగానే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ ‘దే దే ప్యార్ దే’ సినిమాతో బోణి కొట్టింది. ఈ సినిమా కోసం రకుల్ ఓ రేంజ్ లో గ్లామర్ ఒలకబోసింది. బ్రా అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని బుట్టలో వేసుకొంది. ఇప్పుడు రకుల్ తదుపరి సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అలాగని టాలీవుడ్ ని వదిలిపెట్టలేదు. కింగ్ నాగార్జున జంటగా మన్మథుడు2లో నటిస్తోండి. ఐతే, ఈ సినిమా కోసం ఏకంగా రూ. 1.5కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొందట. హీరో తర్వాత అత్యధిక పారితోషికం తీసుకొంది రకుల్ నే. ఆ రేటుకి రకుల్ న్యాయం చేసింది కూడా. టీజర్, ట్రైలర్ లో ఆ విషయం అర్థమవుతోంది. బాలీవుడ్ కి వెళ్లొచ్చిన అనుభవంతో మన్మథుడు 2 కోసం షర్ట్ గుండీలు విప్పింది. బ్రా అందాలతో కనువిందు చేసింది. నాగ్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. సినిమాలో ఆ ఘూటు రొమాన్స్ ని చూడబోతున్నాం.

ఈ సినిమాను రకుల్ వున్న కారణంగా హిందీ డబ్బింగ్, శాటిలైట్ మంచి రేటుకు అమ్మే అవకాశం వుంటుంది. ఆమె రెమ్యూనిరేషన్ అక్కడ కిట్టుబాటు అయిపోతుంది. మన్మథుడు 2కి ఓకే. కానీ, తదుపరి సినిమాల కోసం కూడా రకుల్ ఆ రేటు డిమాండ్ చేస్తే కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. పెంచిన తర్వాత తగ్గించడం హీరోయిన్స్ ఇష్టముండదు కదా.. !