కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం.. ఈరోజే !

కర్ణాటక రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈరోజే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఉదయం యడ్యూరప్ప గవర్నర్ వాజూభాయ్ వాలాని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అందుకు గవర్నర్ వెంటనే ఒకే చెప్పడంతో.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు యడ్డీ. ఈ సాయత్రం 6.15నిమిషాలకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిపారు. ఈరోజు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వాస్తవానికి కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన వెంటనే యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాట్లు రెడీ అయ్యారు. ఐతే, అందుకు బీజేపీ అధిష్టానం అనుమతిని ఇవ్వలేదు. రాజకీయ సంక్షోభంపై ఆచితూచి అడుగులేద్దామని అధిష్టానం సూచించింది. ఈలోగా స్వీకర్ రమేష్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయడం.. బీజేపీకి మరింత ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలు రాష్ట్రపతి పాలన లేదంటే మధ్యంతరం దిశగా తీసుకెళ్లినట్టు అనిపించాయి. ఐతే, అనూహ్యంగా యడ్యూరప్ప సీఎం గా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసి… రాజకీయ సంక్షోభానికి పులిస్టాప్ పెట్టబోతున్నారు.