షాక్ : ఆన్ లైన్ లో.. ‘డియర్ కామ్రేడ్’ హెచ్‌డీ ప్రింట్ లీక్

కామ్రేడ్ విజయ్ దేవరకొండకు తమిళ్ రాకర్స్ షాక్ ఇచ్చారు. భారీ అంచనాల మధ్య ‘డియర్ కామ్రేడ్’ దక్షిణాది (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) అన్నీ బాషల్లో శుక్రవారం విడుదలైంది. మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. అదే సమయంలో విజయ్, రస్మికల నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ క్రేజ్ తోనైనా కామ్రేడ్ బయటపడిపోతాడని అనుకొన్నారు.

ఇంతలో తమిళ్ రాకర్స్ కామ్రేడ్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలో ఆన్ లైన్ లో లీక్ చేశారు. అది కూడా హెచ్‌డీ ప్రింట్. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆందోళన చెందుతోంది. అసలే స్లో నేరేషన్ సినిమాని దెబ్బతీసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాన్నుంచి బయటపడటానికి 10-20ని॥ ట్రిమ్ చేద్దామని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పుడు ఏకంగా సినిమాయే బయటకిరావడం తలలు పట్టుకొంటోంది. వీటినన్నింటిని దాటుకొని కామ్రేడ్ సేఫ్ జోన్ కి చేరుతాడేమో చూడాలి.