కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. హరీష్ రావుకు చోటు ?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినేట్ విస్తరించబోతున్నట్టు సమాచారమ్. ఆగస్టు తొలివారంలో కేబినెట్ విస్తరణ ఉండనుందని తెలుస్తోంది. కేబినెట్ లోకి మరో నలుగురిని తీసుకోనున్నారు. ఈ లిస్టులో హరీష్ రావు పేరు కూడా వినిపిస్తోంది. మంత్రివర్గంలో హరీష్ కి చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ని కావాలన్నే తొక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హరీష్ ని కేబినేట్ లోకి తీసుకొని ఈ ప్రచారనికి పులిస్టాప్ పెట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, కేబినేట్ లోకి ఇద్దరు మహిళలని తీసుకొంటానని గతంలో సీఎం కేసీఆర్ మాటిచ్చిన సంగతి తెలిసిందే.

తాజా కేబినెట్ విస్తరణలో ఇద్దరు మహిళలకి చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్షారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయ్. వీరితో పాటు పద్మా దేవేందర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక, మాజీ మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరావు పేర్లని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారమ్. మొత్తంగా.. తాజా కేబినేట్ విస్తరణతో తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న కొన్ని ఆరోపణలకి చెక్ పెట్టేలా కనిపిస్తోంది.