హీరోపై తప్పుడు ప్రచారం !
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ సౌత్ యూత్ మెగాస్టార్ అనిపించుకోవాలని ఆశపడుతున్నట్టు కనబడుతోంది. ఆయన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ దక్షిణాది (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ) అన్ని బాషల్లో శుక్రవారం విడుదలైంది. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొంది. ఇక, తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా ‘హీరో’ని దక్షిణాది అన్నీ బాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఐతే, ఇప్పుడీ సినిమా షూటింగ్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
స్క్రిప్టు విషయంలో విజయ్, ఆనంద్‌కు భిన్నాభిప్రాయాలు ఏర్పడటంతో చిత్రీకరణను ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ సలహాలు తీసుకోవడం ఆనంద్‌కు నచ్చలేదని కూడా చెబుతున్నారు. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ కూడా అవుట్‌పుట్ విషయంలో సంతృప్తికరంగా లేరట. ఐతే, ఈ ప్రచారంలో నిజం లేదన్నది లెటెస్ట్ న్యూస్. విజయ్ నెక్ట్స్ కార్తీ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. అది పూర్తయిన తర్వాత ‘హీరో’ షూటింగ్ లో పాల్గొంటారని చెబుతున్నారు. అంటే.. ‘హీరో’ సినిమా ఆగిపోలేదు. షూటింగ్ కి బ్రేక్ పడిందంతే.. !
‘హీరో’కి జంటగా మాళవికా మోహన్ జతకట్టనుంది. ఇందులో విజయ్ బైకర్‌గా సందడి చేయనున్నాడు. ఇప్పటికే రూ.15 కోట్ల ఖర్చుతో కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది. ఢిల్లీ బైక్ రేసుకు సంబంధించిన సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ యేడాది చివరల్లో హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.