కోహ్లీ-రోహిత్ గొడవ అప్పుడే మొదలైందా ?


టీమిండియాలో విబేధాలు ఉన్నాయి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు గ్రూపులు తయారయ్యాయి అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది నిజమే అన్నట్టు ఇటీవల రోహిత్, అతని భార్య సోషల్ మీడియాలో విరాట్ దంపతులని అన్ ఫాలో చేశారు. మరోవైపు కోహ్లీ-రోహిత్ వివాదంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం బీసీసీఐ చేయడం లేదు.

ఇదీగాక, విభేదాలు లేవని చెప్పేందుకు ఆస్కారమే లేదు. పాలకుల కమిటీ అధినేతేమో ఇదంతా మీడియా సృష్టి అంటున్నారు. అదే నిజమైతే విభేదాలు లేవని నిరూపించకుండా ఉత్త మాటలు ఎలా చెబుతారు ? అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.
వన్డే జట్టులో ఎలాంటి విభేదాలు లేవని మీడియాకు చెప్పేందుకు సీఓఏ ఎంతగానో ప్రయత్నించింది. కమిటీలోని ఒక సభ్యుడు విబేధాలపై సోషల్‌ మీడియాలో సానుకూల సందేశం రాయాలని టీమిండియాలోని ఒక సీనియర్‌ ఆటగాడితో ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఈ విషయంలో ఎలాంటి స్పందనలేదని తెలుస్తోంది.

వరల్డ్ కప్ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన తర్వాతే కోహ్లీ-రోహిత్ ల మధ్య చెడినట్టు సమాచారమ్. ఆ మ్యాచ్ ఓటమికి బౌలింగ్‌ విభాగాన్ని నిందించారని తెలుస్తోంది.