ఫిల్మ్‌ఛాంబర్‌లో దిల్ రాజు ప్యానల్ ఓటమి


నిర్మాత సి. కల్యాణ్ చేతిలో మరో నిర్మాత దిల్ రాజు ఘోరంగా ఓడిపోయారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ప్రొడ్యూసర్ సెక్టార్‌కి సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఎన్నికల్లో నిర్మాతలు దిల్‌రాజు, సి.కల్యాణ్‌ ప్యానెల్‌లు పోటీ పడ్డాయి. శనివారం ఉదయం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 12 మంది ఈసీ సభ్యులలో సి. కల్యాణ్‌ ‘మన ప్యానెల్‌’కు చెందిన వారు 9 మంది, దిల్‌రాజు ‘యాక్టివ్‌ ప్యానెల్‌’కు చెందిన వారు ఇద్దరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా మోహన్‌ గౌడ విజయం సాధించారు.

ఇక, 20 మంది సెక్టార్‌ సభ్యులలో మొత్తం 16 మంది సి. కల్యాణ్ ప్యానెల్‌ నుంచి గెలుపొందారు. 4గురు మాత్రమే దిల్‌రాజు ప్యానెల్‌ నుంచి విజయం సాధించారు. ఈసీ సభ్యులుగా దిల్‌రాజు, దామోదర్ గెలుపొందారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ అన్నీ దిల్ రాజు చేతిలో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ తాజా ఎన్నికల్లో కనిపించినట్టుంది. దిల్ రాజు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు.