‘డియర్ కామ్రేడ్’ నెగటివ్ కామెంట్స్ పై విజయ్ షాకింగ్ రియాక్షన్ !
విజయ్ దేవరకొండ మరోసారి దమ్మున్న హీరో అనిపించుకొన్నాడు. ఆయన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. రష్మిక మందన కథానాయిక. మైత్రీ మువీస్ నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. సినిమా స్లోగా ఉంది. ఇదీ విజయ్ రేంజ్ సినిమా కాదనే కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు. “సినిమా చాలా బాగుంది. కానీ, స్లో ఉందన్న అంటున్నారు. చాలామంది ఎమోషనల్ అయిపోయే వాళ్ల స్టోరీస్ చెబుతున్నారు. చాలా మంది థియేటర్స్ నుంచి టచ్ చేశావ్. ఏడ్ఛేశాం.. కనెక్ట్ అయ్యామని చెబుతున్నారు. అందరీ అభిప్రాయాలని పూర్తిగా గౌరవిస్తాం. ఎందుకంటే ? ఈ కథని మేం ఇలానే చెప్పాలనుకొన్నాం” అన్నారు విజయ్. ఈ సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా. ఇది నాకు గొప్ప సినిమా అన్నారు.
The USA collections of #DearComrade have been rocketing. People are going in for an emotional roller coaster ride of this beautiful and consuming love story. Go witness it at your nearest theatres. #DearComrade💥@TheDeverakonda @iamRashmika @MythriOfficial @bharatkamma pic.twitter.com/8sh1TidMtM
— Sarigama Cinemas (@sarigamacinemas) July 27, 2019