బ్రేకింగ్ : బిగ్ బాస్ హౌస్ నుంచి హేమ అవుట్


బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకొంది. తొలివారం హౌస్ నుంచి హేమ ఎలిమినేట్ అయ్యారు. ఆరుగురు ఎలిమినేషన్ లిస్టులో ఉన్నప్పటికీ.. జాఫర్, హేమలు ఎలిమినేషన్ కి దగ్గరగా వెళ్లారు. వీరిద్దరిలో హేమకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఇక, ఎప్పటిలాగే ఎలిమినేట్ అయిన హేమతో నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు.

హౌస్ సభ్యుల్లో బాబా మాస్టర్, శ్రీముఖి ఫైనల్ వరకు వెళ్లొచ్చని హేమ అభిప్రాయపడ్డారు. సభ్యులు కన్నింగ్ ఎవరు లేరు. అందరు మంచివారేనని కితాబిచ్చారు. అంతకుముందు చీటిలో సాంగ్ పేర్లని రాసి.. వాటిని సైగలతో సభ్యులు గుర్తించే ఆటనిఆడిపించారు నాగ్. అది చాలా సరదాగా సాగింది. ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా ఉంది. ఆ వెంటనే సీరియస్ మోడ్ లోకి తీసుకెళ్లి.. ఎమినేషన్ ప్రకటించారు నాగ్.