సప్రైజ్ : బిగ్ బాస్ హౌస్’లోకి తమన్నా


తొలివారంలోనే బిగ్ బాస్ బిగ్ సప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్’లోకి తమన్నాని తీసుకొచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె హౌస్’లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ నుంచి తొలి ఎలిమినేషన్ గా హేమ అవుటయ్యారు. వెంటనే ఆమె స్థానాన్ని తమన్నాతో భర్తీ చేయడం విశేషం. బిగ్ బాస్ హౌస్’లోకి ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ తమన్నా కాదు. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి.

తొలివారం పూర్తయ్యాక హౌస్’లోకి ఎంట్రీ ఇవ్వడం తమన్నాకు అడ్వాంటేజ్ యే. ఇదే ప్రశ్నని నాగార్జున కూడా అడిగారు. అలాంటిదేమీ లేదు. ముందస్తుగా ఏమీ ప్రీపేర్ కాలేడు. హౌస్’లోకి ఇతరుల ప్రవర్తనని బట్టీ రియాక్ట్ అవుతానని తెలిపింది తమన్నా. హౌస్’లోని సభ్యులనే కాదు. తెలుగురాష్ట్రాల ప్రజల మనసులని గెలుస్తాను. వారిని తన అభిమానులు గా మార్చుకొంటానన్నారు తమన్నా. బిగ్ బాస్ తెలుగులో ట్రాన్స్ జెండర్ ని తీసుకోవడం ఇదే తొలిసారి.