దిల్ రాజు బ్యానర్’లో మెగాస్టార్ సినిమా.. !

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్దిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. నయనతార, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండనుంది. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జెడ్ స్వీడుతో జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నే నిర్మించే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా.. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవితో ఓ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారమ్. ఇటీవలే దిల్ రాజు మెగాస్టార్ ని కలిసి ఈ విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మెగాస్టార్ కోసం దిల్ రాజు ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేసి ఉంటాడు. ఇంతకీ ఆ కథని రెడీ చేసింది ఎవరు ? దానికి దర్శకత్వం వహించనుంది ఎవరు ?? అన్నది తెలియాల్సి ఉంది.