బిగ్ బాస్ పై హేమ షాకింగ్ కామెంట్స్


కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 తెలుగు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో విజయవంతంగా తొలివారాన్ని పూర్తి చేసుకొంది. తొలివారం హౌస్ నుంచి హేమ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి వెళ్లిపోయిన సమయంలో బిగ్ బాస్ పై హేమ సానుకూలంగా స్పందించారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిపై ఫిర్యాదు చేయలేదు. ఐతే, బయటికి వెళ్లిన తర్వాత టీవీల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్‌బాస్‌-3 నుంచి కావాలనే తనను బయటకు పంపారని ఆరోపించారు. ఈ షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలేదన్నారు. లోపల ఒకటి జరిగితే బయట ఒకటి ప్రసారం చేశారని విమర్శించారు. తొలివారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఎలినేషన్ లోఉండగా.. వీరి నుంచి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసింది. ఇక, హేమ తాజా ఆరోపణలపై బిగ్ బాస్ యాజమాన్యం లేదంటే హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగ్ ఏ రియాక్ట్ అవుతాడేమో చూడాలి.